: బీజేపీలోకి నేను వెళ్లదలచుకుంటే చెప్పే వెళతాను: రేణుకా చౌదరి
‘నేను పార్టీ మారదలచుకుంటే ..నిర్మొహమాటంగా, బహిరంగంగా అందరికీ చెప్పి.. చాలా గొప్పగా బయటకు వెళతాను’ అని కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేణుకా చౌదరి అన్నారు. ఒక న్యూస్ ఛానెల్ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తనకు సముద్రంలో ఈదడం అలవాటైపోయిందని, బావిలో కప్పలా బతకడం తన వల్ల కాదని అన్నారు. తాను, పార్టీ మారనప్పుడు అనవసరమైన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. నైతిక విలువలు, సిద్ధాంతాలు పాటించని వాళ్లు, స్వప్రయోజనాలు చూసుకునేవాళ్లే పార్టీలు మారతారని, అటువంటి వాళ్లు పార్టీలో ఉంటే ఎంత? లేకపోతే ఎంత> అని ఒక ప్రశ్నకు సమాధానంగా రేణుకా చౌదరి చెప్పారు.