: పవన్ ఆ పని చేస్తే మా చంద్రబాబునాయుడి గారికి ఒక నమస్కారం పెట్టి...ఈయన వెంట వస్తాం!: జేసీ దివాకర్ రెడ్డి
"ఏపీకి ప్రత్యేక హోదా సాధిస్తానని పవన్ కల్యాణ్ కనుక చెబితే, మా చంద్రబాబు నాయుడిగారికి ఒక నమస్కారం పెట్టి.. 'ఇన్నాళ్లూ మమ్మల్ని బాగా చూసుకున్నారు, స్పెషల్ స్టేటస్ సాధిస్తానని ఆ మహానుభావుడు చెప్పాడు.. కాబట్టి ఆయన వెనుక వెళుతున్నామ'ని చెబుతాను" అని టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘పవన్ గారూ, రండి, మీకు చేతనైతే ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేయండి. లీడ్ తీసుకో, వీ విల్ అప్రిసియేట్ యు. ఏ పార్టీకి చెందిన వారైనా నీ వెంట రావడానికి సిద్ధంగా ఉన్నాము. పవన్ ఏదో రెండు రోజులు ప్రజల ముందుకు వచ్చి జిందాబాద్ అని ఆయన అనిపించుకుని, మమ్మల్ని మురాదాబాద్ అనిపించడం బాగోలేదు. ప్రత్యేక హోదా విషయమై, ఎంపీలందరూ రాజీనామా చేసినా ప్రధాని నరేంద్ర మోదీ వెంట్రుక కూడా తెగదు’ అంటూ జేసీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.