: ‘సీమ’ నీటి కోసం రోడ్డెక్కనున్న వైఎస్ జగన్! వచ్చే నెల 3 న కడప కలెక్టరేట్ ఎదుట వైసీపీ అధినేత ధర్నా!
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోమారు రోడ్డెక్కుతున్నారు. రాయలసీమకు సాగు, తాగు నీటి కోసం ఆయన ఈ దఫా ధర్నాకు దిగనున్నారు. ఈ మేరకు వైపీసీ కార్యాలయం నుంచి కొద్దిసేపటి క్రితం ఓ ప్రకటన విడుదలైంది. వచ్చే నెల 3న కడప కలెక్టరేట్ ముందు ధర్నాకు వైసీపీ తీర్మానించింది. ఈ ధర్నాలో వైఎస్ జగన్ స్వయంగా పాలుపంచుకుంటారు. రాయలసీమకు సాగు నీరిస్తామంటూ ప్రభుత్వం ఊకదంపుడు ప్రకటనలు చేస్తుందే తప్పించి, వాస్తవంగా చుక్క నీటిని కూడా రాయలసీమకు వదలడం లేదని వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.