: పవన్ కల్యాణ్ డిమాండేమీ కొత్త కాదు!...‘హోదా’పై రెండేళ్ల నుంచి మేం చెబుతున్నది అదేగా!: ఏపీ మంత్రి దేవినేని ఉమ
తిరుపతి బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వినిపించిన డిమాండ్ పై టీడీపీ సీనియర్ నేత, ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కాసేపటి క్రితం స్పందించారు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో జలవనరుల శాఖ కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా దేవినేని ఉమ మీడియాతో మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు ప్రత్యేక ప్యాకేజీ కూడా కావాలని గడచిన రెండేళ్ల నుంచి తాము కేంద్రాన్ని కోరుతూనే ఉన్నామని ఆయన పేర్కొన్నారు. తిరుపతి సభలో పవన్ కల్యాణ్ కూడా ఇదే డిమాండ్ ను వినిపించారని చెప్పిన ఆయన... పవర్ స్టార్ డిమాండ్ లో కొత్తదనమేమీ లేదని తేల్చేశారు.