: కశ్మీర్ అల్లర్ల ఫలితం.. హురియత్ చైర్మన్ ఉమర్ ఫరూఖ్‌ను తొలిసారి అరెస్ట్ చేసిన పోలీసులు
కశ్మీర్ అల్లర్లను అదుపు చేసి రాష్ట్రంలో తిరిగి శాంతి నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం తొలిసారిగా హురియత్ చైర్మన్ మిర్వైజ్ ఉమర్ ఫరూఖ్‌ను అరెస్ట్ చేసింది. శుక్రవారం ఈద్గాలో నిర్వహించిన మార్చ్‌లో పాల్గొనేందుకు ప్రయత్నించిన ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం చెష్మా సాహి సబ్‌జైలుకు తరలించారు. వేర్పాటువాద నేతలను గృహ నిర్బంధంలో ఉంచడం జరుగుతున్నా, అరెస్ట్ చేయడం మాత్రం ఇదే తొలిసారి. లోయలో పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే వరకు ఇలాంటివి చేయడం తప్పదని విద్యాశాఖా మంత్రి నయీమ్ అక్తర్ పేర్కొన్నారు. అయితే ఉమర్ ఫరూఖ్ అరెస్ట్‌పై స్పందించేందుకు పోలీసులు నిరాకరించారు.