: అందుకే, ఆచి తూచి మాట్లాడతాను: పవన్ కల్యాణ్
నోరు జారితే వెనక్కి తీసుకోలేమని సినీ నటుడు పవన్ కల్యాణ్ తెలిపారు. తిరుపతిలో ఆయన బహిరంగ సభలో మాట్లాడుతూ, అందుకే తాను ఆచితూచి మాట్లాడతానని అన్నారు. తనకు డబ్బు మీద, సినిమాల మీద వ్యామోహం లేదని చెప్పారు. సమాజం మీద వ్యామోహం ఉందని అన్నారు. 'సినిమాల్లో డబ్బు సంపాదించాలంటే సంపాదించవచ్చని, అయినా తాను రాజకీయాల్లోకి రావడానికి వర్తమాన రాజకీయ పరిస్థితులే కారణమని ఆయన చెప్పారు. సినిమాల్లో సమస్యలకు రాందేవ్ బాబా 2 మినిట్ నూడిల్స్ లా ఇన్ స్టెంట్ పరిష్కారాలు దొరుకుతాయని అన్నారు. కానీ వాస్తవ జీవితంలో అలా జరగవని అన్నారు. తాను ముఖ్యంగా మూడు విషయాలు మాట్లాడేందుకు వచ్చానని ఆయన అన్నారు. తిరుపతిలోనే ఎందుకు మాట్లాడాలని నిర్ణయించుకున్నానంటే, ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు, ప్రధానిగా మోదీకి మద్దతు పలికింది ఇక్కడి నుంచేనని ఆయన చెప్పారు. అభిమానులు ప్రశాంతంగా ఉంటే, సంయమనం పాటించి ఉంటే అన్ని విషయాలు సవివరంగా మాట్లాడతానని ఆయన అభిమానులను ఉద్దేశించి అన్నారు.