: 'నేను ట్వీట్ చేశాను... మోదీ కదిలారు' అంటున్న బ్రిటన్ జర్నలిస్టు మోర్గాన్ పై తిట్ల వర్షం!


కేవలం రెండు పతకాలు మాత్రమే తెచ్చుకుని ఇన్ క్రెడిబుల్ ఇండియా అని గొప్పగా చెప్పుకుంటున్నారంటూ ట్వీట్లు చేసి, క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తో పాటు వందలాది మంది నెటిజన్ల చేత తిట్లు, చీవాట్లు తిన్న బ్రిటన్ జర్నలిస్టు పియర్స్ మోర్గాన్ మరోసారి ట్విట్టర్ లోకి వచ్చాడు. 2020, 2024, 2028 ఒలింపిక్స్ లో పతకాల సాధనే లక్ష్యంగా, ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసిన వేళ, తన మూలంగానే మోదీ కదిలారని అవాకులు చవాకులు పేలాడు. "బ్రేకింగ్ న్యూస్... ఒలింపిక్ వైఫల్యంపై నా ట్వీట్లతో భారత ప్రధాని మోదీ కదిలారు" అంటూ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు క్రెడిట్ ను తాను తీసుకునే ప్రయత్నం చేశాడు. మోర్గాన్ వైఖరిని గర్హిస్తున్న వారి సంఖ్య ఇప్పుడు మరింతగా పెరిగింది.

  • Loading...

More Telugu News