: 'మిస్ అమరావతి' కోసం పోటీ పడుతున్న గుంటూరు భామలు
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో అత్యంత అందమైన అమ్మాయిల కోసం పోటీ మొదలైంది. ఫ్యూచర్ ఆల్, సాయి క్రియేటివ్ ఎంటర్ టెయిన్ మెంట్స్ సంయుక్తంగా 'మిస్ అమరావతి' ఎంపిక పోటీలను నిర్వహించగా, కిరీటం దక్కించుకునేందుకు గుంటూరు భామలు పోటీ పడ్డారు. ర్యాంప్ పై క్యాట్ వాక్ లు చేస్తూ హొయలు పోయారు. గుంటూరు నుంచి ఫైనల్స్ కు 11 మందిని ఎంపిక చేశామని, విజయవాడలో కూడా ఇలాగే మరో 11 మందిని ఎంపిక చేసి, ఫైనల్ పోటీలు నిర్వహిస్తామని నిర్వాహకులు ప్రకటించారు. అక్టోబర్ లో ఫైనల్స్ ఉంటాయని చెప్పారు.