: దర్శకుడు రాజమౌళిని కలిసే అవకాశమొస్తే చాలు!: 'పెళ్లి చూపులు' హీరో విజయ్ దేవరకొండ
ప్రముఖ దర్శకుడు రాజమౌళిని కలిసే అవకాశమొస్తే చాలని, చాలా హ్యాపీ ఫీలవుతానని సినీ నటుడు విజయ్ దేవరకొండ అన్నాడు. ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, రాజమౌళిని కలిసే ఛాన్స్ వస్తే కనుక కొద్దిసేపు ఆయనతో మాట్లాడుతూ టైంపాస్ చేస్తానని చెప్పాడు. తనకు హారర్ చిత్రాలంటే అంతగా ఆసక్తి లేకపోయినప్పటికీ, రాజమౌళి దర్శకత్వంలో కనుక ఇటువంటి సినిమాలో నటించే ఆఫర్ వస్తే స్క్రిప్ట్ విన్న తర్వాత ఓకే చెప్పేస్తానని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. నవ్వే సన్నివేశాల్లో నటించడం తనకు కష్టమని, మొదటి టేక్ లో అయితే ఇటువంటి సన్నివేశాలు బాగా చేయగలుగుతానని, అదే కనుక ఎక్కువ టేక్ లు తీసుకుంటే సహజత్వం ఉట్టిపడేలా నటించడం తనకు కొంచెం కష్టమవుతుందని ‘పెళ్లి చూపులు’ చిత్రం నటుడు విజయ్ చెప్పాడు.