: రామాంతపూర్ లో నయీం అనుచరుల హల్ చల్


ఒకవైపు నయీం కేసులపై సిట్ అధికారులు విచారణ చేస్తుండగానే నయీం అనుచరులు హైదరాబాదులో హల్ చల్ చేయడం కలకలం రేగుతోంది. హైదరాబాదులోని రామాంతపూర్ లో రియల్టర్ కేఆర్సీ రెడ్డి ఆఫీసుకు వెళ్లిన నలుగురు నయీం అనుచరులు డబ్బులివ్వాలంటూ బెదిరింపులకు దిగారు. దీంతో కేఆర్సీ రెడ్డి ఎదురుతిరిగి ఎందుకివ్వాలంటూ ప్రశ్నించడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ నలుగురు దుండగులు ఆ ఆఫీసులోని ఫర్నిచర్ తగులబెట్టి పరారయ్యారు. గతంలో నయీం బతికి ఉండగా, కేఆర్సీ రెడ్డిని భయపెట్టినట్టు తెలుస్తోంది. అయితే నయీం పోయినా దందా బతికే ఉందని, దందాలో ఆయన వారసులు ఉన్నారని చెప్పడానికే ఇలాంటి దుస్సాహసానికి ఒడిగట్టినట్టు పలువురు అనుమానిస్తున్నారు.

  • Loading...

More Telugu News