: హిందీ సినిమాలో పాట పాడనున్న వెస్టిండీస్ క్రికెటర్ బ్రావో
వెస్టిండీస్ క్రికెటర్, సింగర్ డ్వెయిన్ బ్రావో ఒక హిందీ చిత్రంలో పాట పాడనున్నాడు. 2001లో వచ్చిన ‘తుమ్ బిన్’ చిత్రానికి సీక్వెల్ గా 'తుమ్ బిన్-2’ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు అనుభవ్ సిన్హా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘జాగర్ బాంబ్..’ అనే పాటను బ్రావో, అంకిత్ తివారీలతో పాడించాలనుకుంటున్నారు. కాగా, సెప్టెంబర్ మొదటివారంలో ఈ పాట చిత్రీకరణ నైట్ క్లబ్ లో జరగనుంది. ఈ పాట చిత్రీకరణ కోసం రొమేనియా నుంచి డ్యాన్సర్లు రానున్నారు.