: తూర్పు గోదావరి జిల్లాలో వెయ్యడుగుల జాతీయ పతాకంతో ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు


భార‌త దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు గడిచిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు బీజేపీ నేతృత్వంలో తెలుగు రాష్ట్రాల్లో తిరంగా యాత్ర నిర్వ‌హిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురంలో బీజేపీ కార్య‌క‌ర్త‌ల ఆధ్వ‌ర్యంలో మోడ్రన్ విద్యాసంస్థలు తిరంగా యాత్ర నిర్వహించారు. వెయ్యి అడుగుల జాతీయ పతాకాన్ని చేతపట్టుకొని విద్యార్థులు యాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. రాజగోపాల్‌సెంటర్ నుంచి మార్కెట్ సెంటర్ వరకు ర్యాలీ కొనసాగింది. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో కూడా బీజేపీ ఆధ్వ‌ర్యంలో తిరంగా యాత్ర కొన‌సాగుతోంది.

  • Loading...

More Telugu News