: ముఖ్యమంత్రి హోదాలో వుండి అటువంటి ఊతపదాలు వాడొద్దు: కేసీఆర్ వ్యాఖ్యలపై జానారెడ్డి ఫైర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల బేగంపేటలో కాంగ్రెస్ నేతలని సన్నాసులంటూ వ్యాఖ్యలు చేయడం పట్ల తెలంగాణ సీఎల్పీ నేత జానారెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్‌లోని సీఎల్పీ కార్యాలయంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘ఉద్యమ సమయంలో మీరు ఊతపదాలు వినియోగించి ఉండొచ్చు.. కానీ ముఖ్యమంత్రి హోదాలో హుందాగా వ్యవహరించాలి. అటువంటి ఊతపదాలు వాడొద్దు. ముఖ్యమంత్రి వైఖరి బాగోలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈ అంశాన్ని గమనిస్తున్నారు. ముందుగా కేసీఆర్ ప్రజా సమస్యలపై సమాధానం చెప్పాలి. సమస్యలపై సర్కారు గందరగోళంగా వ్యవహరిస్తోంది. ప్రజల ముందుకు వాస్తవాలను తీసుకురావడం లేదు’ అని వ్యాఖ్యానించారు.