: చంద్రబాబుకి ప్రచార పిచ్చి పట్టుకుంది.. కృష్ణా పుష్కరాలనూ అందుకే ఉపయోగించుకున్నారు: భూమన కరుణాకర్‌రెడ్డి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. ఈరోజు తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... చంద్రబాబు తన పార్టీ ప్రచారం కోసమే పాకులాడుతున్నారని ఆరోపించారు. నిన్నటి వరకు కృష్ణా పుష్కరాలను చంద్రబాబు తన ప్రచారం కోసం ఉపయోగించుకున్నారని ఆయన అన్నారు. తాజాగా అన్ని రంగాల్లో టెక్నాలజీ వినియోగం అంటూ ముఖ్యమంత్రి కొత్త డ్రామాకి తెరలేపారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా చంద్రబాబు ప్రచార పిచ్చిలో పడ్డారని భూమన మండిపడ్డారు.