: యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్ లో భారీ చోరీ!... ప్యాసింజర్లకు మత్తు మందు ఇచ్చి రూ.20 లక్షల నగల అపహరణ!
కాచిగూడ- బెంగళూరు మధ్య రాకపోకలు సాగిస్తున్న యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్ లో భారీ చోరీ జరిగింది. నిన్న రాత్రి నిండా ప్రయాణికులతో కాచిగూడ నుంచి బయలుదేరిన సదరు రైల్లో దొంగలు కూడా ఎక్కేశారు. తమకు అనుకూలమైన బోగీని ఎంచుకున్న దొంగలు అందులోని ప్రయాణికులకు మత్తు మందిచ్చారు. ఈ క్రమంలో ప్రయాణికులంతా సొమ్మసిల్లిపడిపోగా... దొంగలు చేతివాటం ప్రదర్శించారు. దాదాపు రూ.20 లక్షల విలువ చేసే ఆభరణాలను ఎత్తుకెళ్లారు. మత్తు వదిలి అసలు విషయం తెలుసుకున్న ప్రయాణికులు నేటి ఉదయం యశ్వంత్ పూర్ రైల్వే స్టేషన్ లో పోలీసులకు పిర్యాదు చేశారు.