: భారత్, ఆఫ్గనిస్థాన్‌ మధ్య బంధం... మాకు నష్టం కలిగించకూడదు: పాక్


భారత్‌, ఆఫ్గనిస్థాన్‌ మధ్య బంధం పాకిస్థాన్ కు కంటగింపుగా మారింది. చైనాతో మైత్రి ద్వారా భారత్ ను భయపెడదామని భావించిన పాక్... భారత్, ఆఫ్గాన్ మధ్య బంధం తమకు ప్రతికూలంగా మారే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు ఈ రెండు దేశాల మైత్రిపై పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నఫీస్ జకారియా అనుమానం వ్యక్తం చేశారు. ఆఫ్గనిస్థాన్ లో ఉగ్రవాద నిరోధానికి మరిన్ని ఆయుధాలు సరఫరా చేస్తామని భారత్ ప్రకటన చేయడంతో... పాక్ పై దాడులకు ఆఫ్గన్ భూభాగాన్ని భారత్ ఎక్కడ వాడుకుంటుందోనని హడలిపోతోంది. ఈ నేపధ్యంలో తమకు వ్యతిరేకంగా ఆఫ్గనిస్థాన్ భూభాగంపై నుంచి భారత్ ఎటువంటి సైనిక కార్యకలాపాలు చేపట్టకుండా చూడాలని పాకిస్థాన్ ఆఫ్గనిస్థాన్‌ ను కోరింది. భారత్, ఆఫ్గనిస్థాన్ మధ్య సహకారం పాక్‌ కు నష్టం కలిగించకూడదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నఫీస్ జకారియా పాకిస్థాన్ రేడియోలో ఓ ప్రకటన చేశారు.

  • Loading...

More Telugu News