: కేజీ ఉల్లిపాయలు రూపాయే!...మధ్యప్రదేశ్ ప్రభుత్వం నజరానా
మధ్యప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఉల్లిపాయలు ఉచితంగా సరఫరా చేయాలని నిర్ణయించింది. అయితే రవాణా ఖర్చుల కోసం రూపాయి చొప్పున వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ ద్వారా ఉల్లిపాయలు ప్రజలకు చేరవేస్తోంది. గత మేలో ఉల్లిపాయల ధరలు గణనీయంగా పడిపోయాయి. కేజీ ఆరు రూపాయల చొప్పున 10.4 లక్షల క్వింటాళ్ల ఉల్లిపాయలు రైతుల నుంచి మధ్యప్రదేశ్ ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ ఉల్లిపాయలు నిల్వ చేసేందుకు సరైన సౌకర్యాలు లేకపోవడంతో అవి కుళ్లిపోతున్నాయి. అలా పాడైపోయే బదులు ప్రజలకు పంచడం మంచిదన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. దీంతో వంద కోట్ల రూపాయల నష్టాన్ని భరిస్తూ...కేవలం రవాణా ఖర్చులు భరించేందుకు కేజీకి రూపాయి వసూలు చేస్తూ రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేయనుంది.