: నయీమ్ నా భార్యాబిడ్డల్ని చంపుతానని బెదిరించాడు.. అప్పుచేసి రూ.25 లక్షలు చెల్లించాను: మరో బాధితుడి ఆవేదన
తెలంగాణ పోలీసుల చేతిలో ప్రాణాలు విడిచిన గ్యాంగ్ స్టర్ నయీమ్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. నయీమ్ హతం కావడంతో ఆయన బాధితులు ఒక్కొక్కరుగా బయటికొచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని బయటపెడుతున్నారు. ఈరోజు నల్గొండ జిల్లా భువనగిరికి చెందిన నందిని ఎలక్ట్రికల్స్ యజమాని చెంచు నరహరి.. నయీమ్ తనను వేధించాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నయీమ్ తనను రెండు కోట్ల రూపాయలు ఇవ్వాలని బెదిరించినట్లు చెప్పాడు. గడువులోపు చెల్లించకపోతే తన భార్యాబిడ్డలను చంపుతానని బెదిరించాడని కన్నీరు పెట్టుకున్నారు. తన ఆస్తంతా అమ్మినా కూడా రెండు కోట్లు రాదని చెప్పినా నయీమ్ మొదట వినలేదని, చివరికి రూ.25 లక్షలు ఇవ్వాలని హుకుం జారీ చేశాడని పేర్కొన్నాడు. తాను అప్పు చేసి నయీమ్‌కి రూ.25 లక్షలు చెల్లించినట్లు తెలిపాడు.