: అందంగా లేనంటూ జెట్ ఎయిర్ వేస్ నన్ను తిరస్కరించడం ఎంత మంచిదైందో!: స్మృతీ ఇరానీ పాత జ్ఞాపకం


"ఎయిర్ హోస్టెస్ ఉద్యోగానికి నేను దరఖాస్తు చేసిన వేళ, జెట్ ఎయిర్ వేస్, నేను అందంగా లేనంటూ తిరస్కరించింది. ఆపై నేను మెక్ డొనాల్డ్స్ లో ఉద్యోగం సంపాదించాను. మిగతాదంతా అందరికీ తెలిసిన చరిత్రే. నాడు జెట్ ఎయిర్ వేస్ నన్ను తిరస్కరించడం ఎంతో మంచిదైంది. వారి నాటి నిర్ణయానికి కృతజ్ఞతలు" అని కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ వ్యాఖ్యానించారు. ఎయిర్ పాసింజర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏపీఏఐ) అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ప్రసంగించారు. ఏపీఏఐలో తానిప్పుడు పాసింజర్ గా చేరానని తెలిపారు. ఓ జెట్ ఎయిర్ వేస్ అధికారికి అవార్డును ఇస్తూ, "నా తొలి ఉద్యోగ ప్రయత్నం గురించి చాలా మందికి తెలిసి వుండకపోవచ్చు. జెట్ లో క్యాబిన్ క్రూ ఉద్యోగం కోసం క్యూలో నిలబడ్డాను. అందమైన శరీరాకృతి లేదంటూ నన్ను తిరస్కరించారు. వారి నిర్ణయం చాలా మంచిదైంది" అని తన యుక్త వయసు రోజులను స్మృతీ గుర్తు చేసుకున్నారు.

  • Loading...

More Telugu News