: సిక్కోలులో వైసీపీకి ఎదురు గాలి!... పార్టీ సమావేశంలోనే జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు!
ఉత్తరాంధ్రలో వైసీపీకి నిన్న భారీ ఎదురుదెబ్బే తగిలింది. శ్రీకాకుళంలో నిన్న జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అధినేత గెలుపుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరుకు నిరసనగా కార్యకర్తలు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఇప్పటికైనా జగన్ తన మైండ్ సెట్ ను మార్చుకోవాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఓడిన వారిని దూరం పెడుతున్న జగన్... తన తీరును మార్చుకోవాలని ధర్మాన వ్యాఖ్యానించిన వెంటనే సమావేశంలో జగన్ కు వ్యతిరేకంగా కార్యకర్తలు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ విషయం తెలిసిన పార్టీ కీలక నేతలు షాక్ తిన్నట్లు సమాచారం.