: ‘విశాఖ’లో నాకు భూములుంటే నట్టి కుమార్ కే ఇచ్చేస్తా: నిర్మాత, నటుడు అశోక్ కుమార్
గ్యాంగ్ స్టర్ నయీమ్ తో తనకు సంబంధాలున్నాయంటూ నిర్మాత నట్టి కుమార్ చేసిన వ్యాఖ్యలను నిర్మాత, నటుడు అశోక్ కుమార్ ఖండించారు. నయీమ్ ఎవరో తనకు తెలియదని పేర్కొన్నారు. విశాఖపట్టణంలో తనకు కనుక భూములుంటే నిర్మాత నట్టి కుమార్ కే ఇచ్చివేస్తానని ఆయన సవాల్ విసిరారు. నట్టి కుమార్ తనపై చేసిన ఆరోపణలను నిరూపించకపోతే ఆయనపై పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తానని అశోక్ కుమార్ అన్నారు.