: కోలీవుడ్ దర్శకుడు హరి ఇంటిపై బాంబు దాడి
'సామి', 'సింగం' వంటి సూపర్ హిట్ సినిమాలను అందించిన తమిళ దర్శకుడు హరి నివాసంపై బాంబు దాడి జరిగినట్టు సమాచారం. చెన్నయ్ లో నివాసం వుండే హరికి పొరుగింటివారితో పార్కింగ్ విషయంలో వివాదం ఉంది. ఈ సందర్భంగా హరి పొరుగువారైన కార్తీక్, కరుప్ప స్వామిలు తనను చంపేస్తామని కూడా బెదిరించారని ఆయన విరుంబాక్కం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బెదిరించినట్టే తన నివాసంపై రెండు బాంబులు వేశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. చిన్న పార్కింగ్ వివాదంపై బాంబులతో దాడి చేయడమేంటని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ బాంబు దాడుల్లో ఎవరైనా గాయపడిందీ లేనిదీ తెలియాల్సి ఉంది.