: కృష్ణా పుష్కరాల్లో చోరీలకు పాల్పడిన 35 మంది అంతర్రాష్ట్ర దొంగల అరెస్టు
పన్నెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో కృష్ణా పుష్కరాలు వైభవంగా జరిగి నిన్న ముగిసిన సంగతి తెలిసిందే. అయితే, పుష్కరాల్లో దొంగలు కూడా భారీ సంఖ్యలోనే హల్చల్ చేశారు. యాత్రికులను హడలెత్తించారు. ఒకవైపు పోలీసులు, సీసీ కెమెరాల నిఘా ఉండగానే దొంగలు భక్తుల దృష్టిని మరల్చి భారీగానే దోచేసుకున్నారు. తమకు దొరికిన ఆధారాలతో దొంగల కోసం గాలింపు జరిపిన పోలీసులు విజయవంతమయ్యారు. కృష్ణా పుష్కరాల్లో చోరీలకు పాల్పడిన 35 మంది అంతర్రాష్ట్ర దొంగలను ఎట్టకేలకు ఈరోజు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.5.25 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. దీని గురించి మరింత సమాచారం అందాల్సి ఉంది.