: ఉప్పల్ కేంద్రీయ విద్యాలయం విద్యార్థులు నలుగురు అదృశ్యం
హైదరాబాద్‌లోని ఉప్పల్ కేంద్రీయ విద్యాలయం విద్యార్థులు నలుగురు ఒకేసారి అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న సాయినాథ్‌రెడ్డి, లికిత్‌కుమార్, విజయ్‌కుమార్, సాయికుమార్ పాఠశాల అయిపోగానే నిన్న సాయంత్రం వారి ఇళ్లకు వెళ్లారు. అయితే, ఇంటికి తిరిగివచ్చిన తరువాత వారు కనిపించకుండా పోయారు. వేరు వేరు ప్రాంతాల్లో నివసిస్తోన్న విద్యార్థులు నలుగురూ ఒకేసారి అదృశ్యమయ్యారు. విజయపురి కాలనీలో విజయ్‌కుమార్, సాయికుమార్ నివాసం ఉంటున్నారు. ఎల్బీనగర్ శివగంగ కాలనీలో సాయినాథ్‌రెడ్డి, నాగోల్‌లో లిఖిత్‌కుమార్ ఇళ్లు ఉన్నాయి. తమ కుమారులు కనిపించకుండా పోవడంతో విజయ్‌కుమార్, సాయికుమార్ తల్లిదండ్రులు ఉప్పల్ పీఎస్‌లో ఫిర్యాదు చేయగా.. సాయినాథ్‌రెడ్డి, లిఖిత్‌కుమార్ తల్లిదండ్రులు ఎల్బీనగర్ లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు విద్యార్థుల ఆచూకీ కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు.