: 12 లక్షల రూపాయలు పలికిన 'జమైకా చిరుత' షూ


జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ షూస్ రికార్డు ధరకు అమ్ముడుపోయాయి. 2015లో బీజింగ్ లో 100 మీటర్ల వరల్డ్ ఛాంపియన్ రేసు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ రేసులో అమెరికా పరుగు వీరుడు జస్టిన్ గాట్లిన్ పై బోల్ట్ విజయం సాధించి, స్వర్ణం దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా బోల్ట్ ఉపయోగించిన షూస్ ను సంతకం చేసి వేలానికి ఉంచారు. ఈ వేలంలో 30 బిడ్లు పోటీ పడగా, అత్యధిక ధరకు బిడ్ వేసిన వ్యక్తి దీనిని సొంతం చేసుకున్నాడు. ఈ షూస్ 16 వేల యూరో (సుమారు 12 లక్షల రూపాయల) కు అమ్ముడుపోయాయని నిర్వాహకులు తెలిపారు.

  • Loading...

More Telugu News