: కడియం నుంచి పూలు, ఆస్ట్రేలియా నుంచి టపాసులు... కృష్ణమ్మకు అట్టహాసంగా వీడ్కోలు
కృష్ణా పుష్కరాల ముగింపు వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్దేశకత్వంలో సినీ దర్శకుడు బోయపాటి శ్రీను ఆధ్వర్యంలో కృష్ణా పుష్కరాల ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. ముగింపు వేడుకల కోసం కడియం నుంచి పూలు తెప్పించిన నిర్వాహకులు, వేడుక చివర్లో ఆస్ట్రేలియా నుంచి తెప్పించిన బాణాసంచా పేల్చారు. దీంతో కృష్ణాతీరం వెలుగు జిలుగులతో కాంతిమయం అయింది. వేలాది ప్రజలు ముగింపు వేడుకలకు హాజరై ఉత్సవాలను తిలకించారు. హారతి కార్యక్రమం, లేజర్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు, టపాసులు వీక్షకులను అలరించాయి.