: మెగాస్టార్ బర్త్ డే వేడుకల్లో సందడి చేసిన పవన్ కల్యాణ్ భార్య


మెగాస్టార్ చిరంజీవి 61వ పుట్టినరోజు వేడుకలు నిన్న ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. అభిమానుల కోసం హైదరాబాద్ శిల్పకళా వేదికలో, సెలెబ్రిటీల కోసం పార్క్ హయత్ హోటల్ లో ‘చిరు’ బర్త్ డే ఫంక్షన్లు నిర్వహించారు.. శిల్ప కళావేదికలో జరిగిన కార్యక్రమానికి ‘అల్లు’, ‘మెగా’ కుటుంబాలకు చెందిన హీరోలు హాజరయ్యారు. ఇక పార్క్ హయత్ హోటల్ లో జరిగిన వేడుకలకు పలువురు సినీ హీరోలు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అయితే, ఈ వేడుకులకు చిరంజీవి తమ్ముడు పవన్ కల్యాణ్ దూరంగా ఉన్నప్పటికీ, ఆయన భార్య అన్నా లెజినివా మాత్రం ఈ కార్యక్రమానికి హాజరై సందడి చేసింది.

  • Loading...

More Telugu News