: పున్నమి ఘాట్ లో పుష్కర స్నానం చేసిన కేంద్ర మంత్రులు
కృష్ణా పుష్కరాల్లో కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, సురేశ్ ప్రభు పాలు పంచుకున్నారు. నంద్యాల-ఎర్రగుంట్ల రైల్వే లైన్ ను ప్రారంభించిన అనంతరం పున్నమి ఘాట్ వద్దకు చేరుకున్న వీరిద్దరూ పుణ్యస్నానమాచరించారు. ఈ సందర్భంగా పుష్కరాల్లో భాగం కావడం సంతోషంగా ఉందని అన్నారు. పుష్కరాల్లో భక్తులకు రైల్వేలు విశేషమైన సేవలందించాయని వారు పేర్కొన్నారు. పెద్ద ఎత్తున భక్తులు పుష్కరాల్లో పాలు పంచుకోవడం శుభసూచకమని ఆయన తెలిపారు.