: సింధు విజయాన్ని ఇంత వేడుకగా జరుపుకోవడానికి ఏముంది?: మలయాళ సినీ దర్శకుడు
రియో ఒలింపిక్స్ లో రజతపతకం సాధించిన సింధును దేశం మొత్తం కొనియాడుతున్న వేళ మలయాళ సినీ దర్శకుడు సనల్ కుమార్ శశిధరన్ విమర్శించాడు. ఆయన అధికారిక ఫేస్ బుక్ పేజీలో 'సింధు రియో ఒలింపిక్స్ లో పతకం సాధించేందుకు వెళ్లింది. పతకం సాధించింది. అందరూ దీనిని వేడుకగా జరుపుకుంటున్నారు. ఇందులో వేడుకగా జరుపుకోవడానికి ఏముంది?' అని ప్రశ్నించాడు. అంతటితో ఆగని ఆయన 'నేను విమర్శిస్తే మాత్రం పోయేదేముంది?' అని వ్యాఖ్యానించాడు. దీనిపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. సింధు సాధించిన ఘనతను తక్కువగా చూడడాన్ని విమర్శిస్తున్నారు. దీంతో ఆయన తన ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చారు. ఆయన గతంలో 'రివు దివసాథే కలి' అనే అవార్డు సినిమాను తెరకెక్కించారు.