: అక్కడ ఒప్పందం.. ఇక్కడ నిరసనలు.. 'మహా' ఒప్పందంపై మండిపడ్డ టీపీసీసీ
నీటి ప్రాజెక్టులపై మహారాష్ట్ర ప్రభుత్వంతో కేసీఆర్ ప్రభుత్వం చేసుకుంటోన్న ఒప్పందం పట్ల టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒప్పందాన్ని నిరసిస్తూ టీపీసీసీ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, పొన్నాల లక్ష్మయ్య, దానం నాగేందర్ గాంధీభవన్ నుంచి హైదరాబాద్ కలెక్టరేట్ వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ సర్కారు అసత్యాలు పలుకుతూ మహారాష్ట్రతో ఒప్పందం చేసుకుంటోందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెడుతోందని ఆయన అన్నారు. రాష్ట్రానికి ఈరోజు మహాద్రోహం జరగబోతోందని వ్యాఖ్యానించారు. ప్రాజెక్టుల విషయంలో తమ పార్టీకి మంచి పేరు వస్తుందనే కుట్రతో ప్రాజెక్టుల రీడిజైన్ చేపట్టారని ఆయన ఆరోపించారు.