: ఈతరం 'నడిగర తిలకం' కమలహాసనే: రజనీకాంత్ పొగడ్తల వర్షం
గత తరానికి 'నడిగర తిలకం' శివాజీ గణేశనే. ఈతరంలో మాత్రం ఆ బిరుదు ఒక్క కమలహాసన్ కు మాత్రమే సరిపోతుందని సూపర్ స్టార్ రజనీకాంత్ పొగడ్తల వర్షం కురిపించాడు. సాధారణంగా సోషల్ మీడియాకు దూరంగా ఉండే రజనీ, కమల్ కు ప్రతిష్ఠాత్మక 'షెవలీర్ డి లార్డ్ ఆర్ట్స్ ఎట్ లెటర్స్' అవార్డు వచ్చిన సందర్భంగా స్పందించారు. తన ప్రియమైన మిత్రుడు హాసన్ కు హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నట్టు ప్రకటించారు. కాగా, కమల్ కు ఈ అవార్డును బహూకరించనున్నట్టు ఫ్రాన్స్ ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. కళారంగంలో సేవలందిస్తున్న వారికి ఈ అవార్డును ఇస్తారు.