: మంచిపేరును నిలబెట్టుకోండి: అధికారులతో చంద్రబాబు
కృష్ణా పుష్కరాలు తుది ఘట్టానికి వచ్చాయని, నేడు, రేపు అధికారులు మరింతగా శ్రమించాల్సి వుంటుందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. పుష్కరాల 11వ రోజు ఏర్పాట్లు, యాత్రికుల రాకపై అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, ఈ 10 రోజుల పాటు ఎంతో మంచి పేరు వచ్చిందని, చివరి రెండు రోజులూ అంతే కష్టపడి వచ్చిన మంచి పేరును నిలబెట్టుకోవాలని సూచించారు. కష్టపడుతున్న ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపిన చంద్రబాబు, తొలి రోజు నుంచి శ్రమించిన వారిని గుర్తుంచుకుని బహుమతులు, ప్రోత్సాహకాలు అందిస్తామని చెప్పారు. కాగా, నేడు కూడా పుణ్యస్నానాల కోసం భక్తులు బారులు తీరారు. విజయవాడలోని అన్ని ప్రధాన ఘాట్లతో పాటు శ్రీశైలం, అలంపురం, నాగార్జున సాగర్ తదితర ప్రాంతాల్లోని ఘాట్లు కూడా కిక్కిరిసిపోయాయి.