: గాడ్ ఫాదర్ చంద్రబాబు నాయుడుగారికి నేనెప్పుడూ రుణపడి ఉంటాను: పీతల సుజాత


‘రాజకీయాల్లో ఒక గాడ్ ఫాదర్ లా నాకు ఇంత లైఫ్ ఇచ్చిన చంద్రబాబునాయుడు గారికి నేనెప్పటికీ రుణ పడి ఉంటాను’ అని ఏపీ శిశు సంక్షేమ, మైనింగ్ శాఖ మంత్రి పీతల సుజాత అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక టీడీపీ మంత్రి అయిన ఆమె ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ‘నేను దళిత సామాజిక వర్గానికి చెందిన మహిళను. 2002లో నేను టీచర్ గా పనిచేశాను. 2004లో చంద్రబాబు నాయుడుగారి పిలుపు మేరకు ఆచంట నియోజకవర్గం నుంచి పోటీ చేశాను. మా నాన్న గారి దీవెనలతో, సీఎం చంద్రబాబుగారి ఆశీర్వాదంతో నేను గెలిచాను. పార్టీ పట్ల విధేయత, అన్ని కార్యక్రమాల్లో నేను యాక్టివ్ గా పాల్గొనడం జరిగేది. 2009 లో పోటీ చేసే అవకాశం నాకు లభించలేదు. అయినప్పటికీ, నేను నిరుత్సాహ పడలేదు. అదే సందర్భంలో చంద్రబాబు గారు నాకు ధైర్యం చెప్పారు. ఇంకా చాలా వయస్సుందని, రాజకీయాల్లో బాగా రాణిస్తానని నాడు చంద్రబాబు గారు నాకు చెప్పారు. ఆ తర్వాత చింతలపూడి నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీతో గెలిచాను. జిల్లాలో నేతల నుంచి నాకు కో-ఆపరేషన్ రావడం లేదనే విషయాన్ని పక్కనబెడితే, రాజకీయాల్లో రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఎప్పటికప్పుడు, అప్ డేట్ చేసుకుంటూ, అందరినీ కలుపుకుంటూ ముందుకు పోవాలి’ అని పీతల సుజాత పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News