: ఏపీ కేబినెట్ సమావేశం తీవ్ర నిరాశ పరిచింది: ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
ఏపీ కేబినెట్ తాజా సమావేశం తీవ్ర నిరాశ పరిచిందని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రియో ఒలింపిక్స్ లో రజత పతకం సాధించిన పీవీ సింధుకు ప్రోత్సాహం ప్రకటించడం, టీటీడీకి, ఒక ప్రైవేట్ కంపెనీకి భూములు కేటాయించడం మినహా ప్రజా సమస్యలపై కేబినెట్ సమావేశంలో చర్చించలేదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై సీఎం చంద్రబాబు మౌనముద్ర వీడాలని అన్నారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు ఆశ వదులుకున్నట్లు కనపడుతోందని విమర్శించారు. పీవీ సింధుకు ఏపీ ప్రభుత్వం ప్రోత్సాహకం ప్రకటించడం సంతోషకరమని ఈ సందర్భంగా ఉమ్మారెడ్డి పేర్కొన్నారు.