: రెండు రోజులు తస్మాత్ జాగ్రత్త: చంద్రబాబు హెచ్చరిక


పుష్కరాల్లో తొలి పది రోజుల పాటు అధికారులు ఎంతో శ్రమించి పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారని, పుష్కరాలు ముగిసే వేళ, అధికంగా యాత్రికులు వచ్చే అవకాశం ఉండటంతో ఏ మాత్రం అజాగ్రత్తకు తావివ్వరాదని సీఎం చంద్రబాబు అధికారులతో అన్నారు. ఈ ఉదయం విజయవాడలోని కమాండ్ కంట్రోల్ సెంటరుకు వచ్చి పరిస్థితిని సమీక్షించిన ఆయన అధికారులతో మాట్లాడారు. మరో రెండు రోజుల పాటు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం మరో రెండు రోజుల జాగ్రత్తతోనే లభిస్తుందని అన్నారు. పుష్కరాల్లో ఏర్పాట్లపై ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని, తాను ఎవరిని అడిగినా అధికారులపై ప్రశంసలే కురుస్తున్నాయని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News