: సింధు మ్యాచ్ మొత్తం చూశా... ఎంతో టెన్షన్ పడ్డాను: తమిళనాడు సీఎం జయలలిత


"పీవీ సింధు ఆడిన ఫైనల్ మ్యాచ్ ని చూశాను. ఎంతో ఉత్కంఠకు గురయ్యాను. ఆమె స్వర్ణ పతకం కోసం వీరోచితంగా పోరాడారు. ఆఖరి మ్యాచ్ లో ఓడిపోయినా, చరిత్ర సృష్టించినందుకు నాకెంతో ఆనందంగా ఉంది. భవిష్యత్తులో ఆమె ఉన్నత స్థితికి చేరుకుంటారని ఆకాంక్షిస్తున్నా" అని తమిళనాడు సీఎం జయలలిత వ్యాఖ్యానించారు. సింధుతో పాటు కాంస్య పతకం గెలిచిన రెజ్లర్ సాక్షికి తన అభినందనలు తెలుపుతూ ఓ ప్రకటన వెలువరించారు. వీరిద్దరూ భారత మహిళా శక్తికి నిదర్శనమని, కఠోర శ్రమే వారిని ఈ స్థితికి చేర్చిందని అన్నారు. సింధు పడిన శ్రమ జాతి యావత్ హృదయాన్ని తాకిందని అన్నారు. వీరిద్దరి కృషే ఇండియాను పతకాల పట్టికలో చేర్చిందని, యువతులందరికీ వీరిద్దరూ ఇప్పుడు ఆదర్శమని జయలలిత అన్నారు. జయలలితతో పాటు డీఎంకే అధినేత కరుణానిధి, పీఎంకే నేత అన్బుమణి రాందాస్, స్టాలిన్, విజయ్ కాంత్, రజనీకాంత్ తదితరులు ఎంతో మంది సింధు ఆటతీరును ప్రశంసించారు.

  • Loading...

More Telugu News