: రేప‌టితో ముగియ‌నున్న రియో ఒలింపిక్స్.. ఇప్ప‌టివ‌ర‌కు టాప్‌-5గా నిలిచిన దేశాలివే!


ఈనెల ఐదో తేదీన అద‌ర‌హో అనేలా ప్రారంభ‌మైన రియో ఒలింపిక్స్ పోటీలు రేప‌టితో ముగియ‌నున్నాయి. ఒలింపిక్స్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 105 ప‌త‌కాల‌ను సాధించిన అమెరికా అగ్ర‌స్థానంలో కొన‌సాగుతోంది. అమెరికా సాధించిన ప‌త‌కాల్లో 38 స్వ‌ర్ణాలు, 35 ర‌జ‌తాలు, 32 కాంస్య ప‌త‌కాలు ఉన్నాయి. గ్రేట్ బ్రిట‌న్ 24 స్వర్ణాలు, 22 ర‌జ‌తాలు, 14 కాంస్య ప‌త‌కాల‌తో మొత్తం 60 ప‌త‌కాలు సాధించి రెండో స్థానంలో ఉంది. 22 స్వ‌ర్ణాలు, 18 రజ‌తాలు, 25 కాంస్య ప‌త‌కాల‌తో మొత్తం 65 ప‌త‌కాలు సాధించిన చైనా మూడో స్థానంలో కొన‌సాగుతోంది. ఇక, నాలుగో స్థానంలో ఉన్న జ‌ర్మ‌నీ మొత్తం 35 ప‌త‌కాలు సాధించింది. వాటిలో 14 స్వర్ణాలు, 8 ర‌జ‌తాలు, 13 కాంస్య ప‌త‌కాలు ఉన్నాయి. ఐదో స్థానంలో ర‌ష్యా కొన‌సాగుతోంది. 13 స్వ‌ర్ణాలు, 16 ర‌జ‌తాలు, 19 కాంస్య ప‌త‌కాలతో ర‌ష్యా ఖాతాలో మొత్తం 48 ప‌త‌కాలు ఉన్నాయి. రియో ఒలింపిక్స్‌లో భార‌త్ 64వ స్థానంలో ఉంది. భార‌త్ ఖాతాలో కేవలం ఒక ర‌జ‌తం, ఒక కాంస్య పతకం మాత్రమే ఉన్నాయి.

  • Loading...

More Telugu News