: సింధుకి మంచి భవిష్యత్ ఉంది.. ప్రత్యేకహోదా చాలా సున్నితమైన అంశం!: పవన్ కల్యాణ్


రియో ఒలింపిక్స్ లో పీవీ సింధు రజత పతకం సాధించడం గర్వంగా ఉందని ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, పీవీ సింధుకి మంచి భవిష్యత్ ఉందని అన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా చాలా సున్నితమైన అంశమని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. కేంద్రంతో గొడవకు దిగడం తనకు ఇష్టం ఉండదని పవన్ కల్యాణ్ చెప్పారు. ప్రత్యేకహోదా సాధన అధికార, ప్రతిపక్ష పార్టీల బాధ్యత అని ఆయన చెప్పారు. ప్రత్యేకహోదా ప్రకటించడం తమ వల్ల కాదని కేంద్రం ప్రకటించిన మరుక్షణం పోరాటం చేస్తానని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News