: మీడియా ముందుకు పవన్ కల్యాణ్!...‘హోదా’పై తర్వాత స్పందిస్తానని వెల్లడి!
టాలీవుడ్ అగ్ర నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చాలా కాలం తర్వత కొద్దిసేపటి క్రితం మీడియా ముందుకు వచ్చారు. కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ కీలక నేత కుమారస్వామి తనను కలిసేందుకు వచ్చిన సందర్భంగా పవన్ మీడియా ముందుకు వచ్చారు. తనతో కుమారస్వామి భేటీ స్నేహపూర్వకమైనదేనని పవన్ చెప్పారు. కృష్ణా పుష్కరాలకు హాజరు కావాలంటూ ఏపీ ప్రభుత్వం నుంచి తనకు ఆహ్వానం అందిందని ఆయన చెప్పారు. ఇక ఏపీకి ప్రత్యేక హోదాపై స్పందించాలని మీడియా ప్రశ్నించగా, అందుకు పవన్ కల్యాణ్ తిరస్కరించారు. ఆ విషయంపై తర్వాత స్పందిస్తానని ఆయన చెప్పుకొచ్చారు.