: ప్రభాస్ ఫ్యాన్స్ కు డబుల్ బొనాంజా!... యంగ్ రెబల్ స్టార్ బర్త్ డే నాడే ‘బాహుబలి-2’ పోస్టర్ల విడుదల!


టాలీవుడ్ యువ కథానాయకుడు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు డబుల్ బొనాంజా దక్కనుంది. అయితే ఇందుకోసం వారు మరో రెండు నెలల పాటు ఎదురుచూడక తప్పదట. అసలు విషయమేంటంటే... ‘బాహుబలి’ సీక్వెల్ ‘బాహుబలి: ద కన్ క్లూజన్’ చిత్రం షూటింగ్ లో ప్రభాస్ బిజీబిజీగా ఉన్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన తొలి పోస్టర్ల విడుదల తేదీలను చిత్ర యూనిట్ ఖరారు చేసింది. ప్రభాస్ జన్మదినమైన అక్టోబర్ 23న వాటిని విడుదల చేసేందుకు యూనిట్ నిర్ణయించినట్లు సమాచారం. ప్రభాస్ బర్త్ డే నాడే అతడి చిత్రం ‘బాహుబలి-2’ పోస్టర్ల విడుదల అంటే... ఇక ఆయన ఫ్యాన్స్ కు డబుల్ బొనాంజా కాక మరేమిటి?

  • Loading...

More Telugu News