: సింధు, గోపీచంద్ లకు ఎంతిద్దాం?... మరికాసేపట్లో తేల్చనున్న చంద్రబాబు!
రియో ఒలింపిక్స్ లో భారత్ కు రజత పతకాన్ని సాధించిన స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు, ఆమె విజయానికి మూల కారకుడిగా భావిస్తున్న పుల్లెల గోపీచంద్ లకు ఏ మేరకు నజరానా ప్రకటించాలన్న అంశంపై మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఏపీ కేబినెట్ తుది నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇడియా (బీఏఐ) సింధుకు రూ.50 లక్షలు, గోపీచంద్ కు రూ.10 లక్షల నజరానాను ప్రకటించిన సంగతి తెలిసిందే. నేటి కేబినెట్ భేటీలో భాగంగా తన కేబినెట్ లోని మంత్రులతో దీనిపై చర్చించనున్న చంద్రబాబు... సింధు, గోపీచంద్ ల నజరానాను ఖరారు చేయనున్నారు.