: హైదరాబాద్ మినిస్టర్స్ క్వార్టర్స్ వద్ద ఉద్రిక్త‌త


హైద‌రాబాద్‌లోని మినిస్ట‌ర్స్‌ క్వార్టర్స్ వ‌ద్ద ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. తమ కాంట్రాక్ట్ ఉద్యోగాలను రెగ్యుల‌రైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఏఎన్ఎం గ్రామస్థాయి మ‌హిళా ఉద్యోగులు ఆందోళ‌నకు దిగారు. మినిస్ట‌ర్ క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లడానికి ప్ర‌యత్నించిన వారిని పోలీసులు గేటు వ‌ద్ద అడ్డుకున్నారు. దీంతో వారు గేటు ముందే బైఠాయించి త‌మ నిర‌స‌న తెలుపుతున్నారు. తమను రెగ్యుల‌రైజ్ చేసి క‌నీస వేత‌నం రూ.21,300 క‌ల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్లను నెర‌వేర్చాలంటూ నినాదాలు చేస్తున్నారు. ఆందోళ‌న‌కు దిగిన మ‌హిళ‌ల‌ను గేటులోప‌లికి వెళ్ల‌నివ్వ‌కుండా పోలీసులు గేటుకు అడ్డంగా నిల‌బ‌డ్డారు.

  • Loading...

More Telugu News