: సింధుకు వెల్లువెత్తిన ప్రశంసలు... రాష్ట్రపతి, ప్రధాని, కేసీఆర్, చంద్రబాబు, జగన్ అభినందనలు
రియో ఒలింపిక్స్ మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఫైనల్స్ లో రజత పతకం సాధించిన సింధుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. దేశం గర్వించదగ్గ ఆటతీరుతో సిల్వర్ మెడల్ గెలుచుకుందని రాజకీయ, క్రీడా, సినీ ప్రముఖులు అభినందిస్తున్నారు. రజతపతకం సాధించిన పీవీ సింధు దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేసిందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కొనియాడారు. భారత ఒలింపిక్ చరిత్రలో సింధు చరిత్ర నెలకొల్పిందని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. సింధు విజయం మరింత మంది క్రీడాకారులకు స్పూర్తిగా నిలుస్తుందని, ఈ స్పూర్తితో టోక్యో ఒలింపిక్స్ లో ఆటగాళ్లు రాణిస్తారని ఆశిస్తున్నానని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. సింధు విజయం ఇతర క్రీడాకారులకు ఆదర్శంగా నిలుస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభినందించారు. అద్భుత విజయం సాధించిన సిందు మహిళలందరికీ స్పూర్తినిచ్చే విజయం సాధించిందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, వైఎస్సార్సీపీ అధినేత జగన్ అభినందించారు. రాజకీయ, క్రీడా, సినీ ప్రముఖులు ఒలింపిక్స్ లో రజతపతకం సాధించిన సింధు, దేశం గర్వించేలా చేసిందని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.