: సింధును కోలుకోనివ్వని కరొలినా...రెండో సెట్ లో ఆధిక్యం


రెండో సెట్ లో పీవీ సింధును కరొలినా మారిన్ కోలుకొనివ్వడం లేదు. మ్యాచ్ ఆరంభం నుంచి నెట్ గేమ్ ను ఎంచుకున్న కరొలినా డ్రాప్ లతో సింధును ముప్పుతిప్పలు పెడుతోంది. సింధుకు స్ట్రోక్ ఆడే అవకాశం ఇవ్వకుండా ఫ్లాట్ గేమ్ ఆడుతోంది. నెట్ కు ఇరు ప్రక్కల మాత్రమే ఆడుతూ కరొలినా పాయింట్లు గెలుచుకుంటోంది. దీంతో సింధు 11-2 స్కోరుతో వెనుకబడింది. కరొలినా మైదానం మొత్తం వేగంగా కలియదిరుగుతూ వరల్డ్ నెంబర్ వన్ ఆటతీరును రుచిచూపించింది. దీంతో సింధు కోలుకునే అవకాశం ఇవ్వకుండా ఆడుతోంది. మ్యాచ్ లో తొలి అర్ధ భాగం మొత్తం కరొలినా మారిన్ పూర్తి స్థాయి ఆధిక్యం ప్రదర్శించింది. సాధికారిక ఆటతీరుతో సింధు కోలుకునే అవకాశం ఇవ్వడం లేదు.

  • Loading...

More Telugu News