: ఆలస్యంగా ప్రారంభం కానున్న సింధు మ్యాచ్... అభిమానుల్లో పెరుగుతున్న ఉత్కంఠ!


భారతీయులంతా టీవీలకు అతుక్కుపోయి ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న రియో ఒలింపిక్స్ మహిళల బ్యాడ్మింటన్ ఫైనల్ మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కానుంది. ఇప్పటికే టీవీ సెట్ల వద్దకు చేరిన కోట్లాది మంది భారతీయులను నిరాశకు గురిచేస్తూ ఒలింపిక్స్ మహిళల బ్యాడ్మింటన్ మ్యాచ్ ఆసల్యం కానుందని నిర్వాహకులు తెలిపారు. దీంతో అభిమానుల్లో మరింత ఉత్కంఠ పెరుగుతోంది. దీనికి తోడు మీడియా ఛానెల్స్ అన్నీ ఆసక్తికర కథనాలు, ఇంటర్వ్యూలతో హోరెత్తిస్తుండడంతో వారిలో అంచనాలు క్షణక్షణానికి పెరిగిపోతున్నాయి. సింధు కోసం ఇంటర్నెట్ లో 2 లక్షల మందికిపైగా భారతీయులు సెర్చ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. టీవీ అందుబాటులో లేని వారు, ఆఫీసుల్లో ఉన్నవారు ఇంటర్నెట్ ఆధారంగా మ్యాచ్ వీక్షించే ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News