: యూపీలో వరద బీభత్సం.. కొట్టుకుపోయిన టాటాసుమో.. నలుగురి మృతి
ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఎడతెరపి లేకుండా కురుస్తోన్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. వరదల ధాటికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో నాలా పొంగడంతో వరద ధాటికి ఓ టాటాసుమో కొట్టుకుపోయింది. దీంతో దానిలోని నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు గల్లంతయ్యారు. వదలకు కొట్టుకుపోయిన వారి మృతదేహాలు కిలో మీటరు దూరంలో రెస్క్యూ బృందానికి దొరికాయి. మరోవైపు జార్ఖండ్‌లోనూ వర్ష బీభత్సం కొనసాగుతోంది. వరదల ధాటికి పలు ప్రాంతాల్లో ఇళ్లు, చెట్లు ధ్వంసమవుతున్నాయి.