: వాచ్ మెన్లపై చేయి చేసుకున్న కేంద్రమంత్రి భద్రతాధికారి


ఢిల్లీలోని ఒక రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లోని వాచ్ మెన్ పై కేంద్ర మంత్రి మహేశ్ శర్మకు చెందిన ఒక భద్రతాధికారి చేయి చేసుకున్నాడు. నిన్న రక్షా బంధన్ సందర్భంగా మంత్రి మహేశ్ తన సోదరి వద్దకు వెళ్లిన సందర్భంలో ఈ సంఘటన జరిగింది. అక్కడికి వస్తున్న మంత్రి కాన్వాయ్ ను గేట్ వద్ద ఉన్న వాచ్ మెన్ అడ్డుకున్నాడు. అంతేకాకుండా, గేటు తెరచేందుకు ఆలస్యం కావడంతో ఇద్దరు వాచ్ మెన్ లపై మంత్రి భద్రతా అధికారి తన ప్రతాపం చూపించాడు. ఈ సంఘటనపై అపార్టుమెంట్ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఈ విషయం తెలుసుకున్న మహేశ్ శర్మ బాధితులకు క్షమాపణలు చెప్పారు. కాగా, ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది.

  • Loading...

More Telugu News