: కూతురు పసిడి పతకం సాధించాలని తండ్రి పూజ!... పెదవేగిలో సింధు తండ్రి ప్రత్యేక పూజలు!
భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పీవీ సింధు రియో ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించాలని యావత్తు భారతావని ఆకాంక్షిస్తోంది. నేటి రాత్రి 7.30 గంటలకు జరగనున్న ఫైనల్ పోరులో స్పెయిన్ కు చెందిన కరోలినా మారిన్ తో సింధు తలపడనుంది. గతంలో జరిగిన ఓ మ్యాచ్ లో మారిన్ ను చిత్తు చిత్తుగా ఓడించిన సింధునే రియో టైటిల్ పోరులో ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. ఈ పోటీలో తన కూతురు విజయం సాధించి భారత్ కు పసిడి పంట పండించాలని సింధు తండ్రి ప్రత్యేక పూజలు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం రాట్నాలమ్మ ఆలయంలో ఈ మేరకు ఆమె తండ్రి వెంకటరమణ కొద్దిసేపటి క్రితం ప్రత్యేక పూజలు చేశారు.