: మరి మా సంగతేంటి?... తెలంగాణకూ కేంద్ర సాయం కావాల్సిందేనంటున్న కవిత!
ఏపీకి రూ.1,976 కోట్ల సాయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మూడు పద్దుల కింద అందజేస్తున్న ఈ సాయానికి సంబంధించి కేంద్రం విస్పష్ట ప్రకటన చేసింది. ఈ ప్రకటన వెలువడిన నేపథ్యంలో నిజామాబాదు ఎంపీ కల్వకుంట్ల కవిత నిన్న హైదరాబాదులో మీడియాతో మాట్లాడిన సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీకి కేంద్ర సాయానికి తాము ఎంతమాత్రం వ్యతిరేకం కాదని ఆమె పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చినా తమకు అభ్యంతరం లేదన్నారు. అయితే ఏపీకి అందించే ప్రతి ప్రయోజనాన్ని కేంద్రం తెలంగాణకూ అందించాల్సిందేనని ఆమె డిమాండ్ చేశారు.