: సాక్షికి ఖేల్‌రత్న.. మరో ఇద్దరికి కూడా!


రియో ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం సాధించి పెట్టిన రెజ్లర్ సాక్షి మాలిక్‌ను రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న అవార్డుతో సత్కరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒలింపిక్స్‌లో పతకాలు సాధిస్తున్న వారిని ఈ అవార్డుతో సత్కరించడం గత కొన్నేళ్లుగా ఆనవాయతీగా వస్తున్న విషయం తెలిసిందే. సాక్షి ఇప్పటి వరకు అర్జున అవార్డు కూడా అందుకోలేదు. అయినా ఆమెకు నేరుగా ‘ఖేల్‌రత్న’ను ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. అలాగే ఒలింపిక్స్‌లో తృటిలో పతకం చేజార్చుకున్న జిమ్నాస్ట్ దీపా కర్మాకర్, షూటర్ జితు రాయ్‌లకు కూడా ఖేల్‌రత్న ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News